You may missed !

Major Highlight of Nani Gentleman - Climax!!!

Actor Nani teamed up with Mohan Krishna Indraganti for the upcoming suspense drama “Gentleman” and he is sharing the screen space with two actress Full Story Here


Jeeva "Sangili Bungili Kathava Thorea" nearing the Terminal!!!

The shooting of Jeeva horror comedy “Sangili Bungili Kathava Thorea”, directed by debutant Ike Radha is nearing its completion. Produced jointly b Full Story Here


Excited, When Saw Something Big!

Erica, just entered industry in 2013 and becoming popular day by day. In her 2 years journey, she acted in Hindi, Telugu, Tamil and Kannada movies. He Full Story Here


Under promotions at Bangalore.

Shreya today visited C. Krishnayya Shetty & Sons BIBHU Mohapatra under their Gold and Diamonds promotions in Bangalore and coming to Shriya looking sa Full Story Here


Is Sai Dharam Tej follows Pawan kalyan style as it is?

Pawan Kalyan - The c/o address of Style and different mannerism. Irrespective of films Success or failure- his style always rules!

Pawan Kaly Full Story Here


ఈ రోజు 'చుట్టాలబ్బాయి' టీజర్

25-06-2016

'ప్రేమకావాలి' చిత్రం తో 2011 లో టాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన వెటరన్ యాక్టర్ సాయి కుమార్ తనయుడు ఆది. మొదటి సినిమాతో నే అతను బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించడం జరిగింది. తర్వాత వచ్చిన సుకుమారుడు, రఫ్, గరం వంటి సినిమాలు పర్వాలేదనిపించినా పెద్దగా హిట్ ను సాధించలేకపోయాయి. కొద్దీ రోజుల క్రితం విడుదల చేసి పర్వాలేదనిపించుకున్న మూవీ 'గరం' తర్వాత సినిమాలలో కనిపించడం లేదు ఇందుకుగల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఎన్నో రోజుల నుంచి తమ అభిమాన నటుని సినిమాకోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక తీరే రోజు దగ్గరలోనే రానుంది.

ఆది నటిస్తున్న 'చుట్టాలబ్బాయి' టీజర్ ఇవాళ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆది సోషల్ మీడియా లో తెలుపుతూ కొత్త పోస్టర్ ను పోస్ట్ చేశాడు. వీరబద్రం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటించనున్నది. ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

రెండు నెలల లోపు అమరావతినుంచే

25-06-2016

వచ్చే రెండు నెలల్లోపు అన్ని కార్యక్రమాలు అమరావతి నుంచే నడపనున్నట్లు పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత చెప్పారు. గొల్ల పూడిలో సివిల్ సప్లై ఆఫీస్ ప్రారంభించిన ఆమె ఇందుకు ఉద్యోగుల తరలింపు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది. అమరావతి నుంచి పనిచేస్తే ఫలితాలు ప్రజలకు తొందరగా అందుతాయని ఆమె అభిప్రాయపడింది. పౌరసరఫరాల శాఖల 11 మంది జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు.

నిన్నటి రోజు నుంచి సచివాలయ ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒప్పుకోవటం తో వాళ్ళు హైద్రాబాద్ నుంచి అమరావతికి రావటానికి ఒప్పుకున్నారు. చాలా రోజుల నుంచి చేశున్న చర్చలు - ప్రభుత్వం వాళ్ల హెఛ్ఆర్ఏ యదావిదంగా ఇస్తామని మరియు వారానికి 5 రోజులు పనిదినాలుగా ప్రకటించటంతో వాళ్ళు అమరావతికి వచ్చారు.

సమస్యలలో చిక్కుకున్న లారెన్స్

25-06-2016

పాపులర్ తమిళ నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన లారెన్స్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తమిళనాడు లోని ఎస్ ఎం ఆర్ విశ్వవిద్యాలయం లో వైద్యవిద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానని వారినుంచి భారీగా సొమ్మును వసూలు చేసుకొని పరారయ్యాడు. అయితే లారెన్స్ కు వేందర్ మూవీస్ అధినేత మదన్ తో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనితో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను చెన్నై లో రెండుగంటల పాటు ప్రశ్నించారు. ఈ వార్త విన్న కోలీవుడ్ షాక్ తిన్నారు.

మదన్ ఇటీవల ఐదు పేజీల లేఖను విడుదలచేస్తూ అదృశ్యమయ్యాడు. అందులో తాను కాశీకి వెళ్తున్నానని అక్కడే మరణిస్తానని పేర్కొన్నాడు. ఆయన కనబడకుండా పోయి సుమారు 25 రోజులు కావస్తోంది. వేందర్ మూవీస్ నిర్మిస్తున్న 'మట్టశివ కెట్టశివ' చిత్రం లో లారెన్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. అటు తన భర్త ఆచూకీ కనుగొనాలని మదన్ భార్యలిద్దరూ పోలీసులను కోరుతున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో నటుడు

25-06-2016

మద్యం సేవించి నిబంధనలకు విరుద్దంగా కారు నడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు ఒక బుల్లితెర నటుడు భరణి శంకర్. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వాహనాలను నిలిపి కొంత మంది వ్యక్తులను పరీక్షించారు. ఈ సందర్బంగా భరణీ శంకర్ కారు ఆపి బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు చేశారు. అందులో అతను 41% పైగా మద్యం సేవించినట్లు తేలడంతో అతనిపై కేసు నమోదుచేసి కారును స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం అతనిని కోర్ట్ లో హాజరు పరచనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి కారు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలకు దారితీస్తుంది. ఆ సమయం లో వాళ్ళు మోతాదుకు మించి తాగటం వల్ల వాళ్లలో వివేచన శక్తి కోల్పోయి వాళ్ళు ఏంచేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా చేస్తుంటారు. అందువల్ల వాళ్ళు తమ జీవితాలను కోల్పోవడమే కాకుండా ఎంతో మంది నాశనానికి పరోక్షంగా కారకులవుతారు.

కోదండరాం పై విమర్శలు తగవు : రేవంత్

25-06-2016

తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఈ రోజు దీక్షకు బయలుదేరాడు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శాసన సభాపక్షనేత రేవంత్ రెడ్డి దీక్షకు బయలుదేరనున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతుగా మెదక్ జిల్లా ఏటిగడ్డ కృష్ణా పూర్ లో రెండురోజులపాటు దీక్ష చేయనున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం పై విమర్శలు చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రజా సమస్యలను ప్రస్తావించడమే అతను చేసిన తప్పా అని ప్రశ్నించాడు. తెలంగాణ ఉద్యమకారునికి ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తిని ఇలా అవమానించడం సరికాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ మంత్రులు మరియు ముఖ్యమంత్రి తీరు మార్చుకోవాలని హితవుపలికారు. కాగా తెలంగాణాలో ఏకైక తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఇటీవలే తెలుగుదేశం నాయకులంతా అధికార పార్టీ టీఆర్ఎస్ చేరిపోవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి పార్టీ అభిప్రాయాలకు కట్టుబడి చివరిదాకా తెలుగుదేశంలోనే కొనసాగుతానని ప్రకటించాడు.


అంజలి పెళ్లికూతురు కాబోతున్నదా?

25-06-2016

'సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు' చిత్రం లో సీతగా ఎంతో మందిని ఆకట్టుకున్న అంజలి ఆ తర్వాత తెలుగు, తమిళం లో మంచి అవకాశాలు రాబట్టుకొని సక్సెస్ అయినది. యంగ్ హీరోయిన్ ల దాటికి ఈ మధ్య అవకాశాలు రాబట్టుకోలేకపోయిన ఈ భామ సరైనోడు లో ఒక ఐటెమ్ సాంగ్ లో కనిపించింది. ఈమె త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. అయితే తమిళ హీరో జై తో కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నదని తమిళ మీడియా కోడై కూస్తున్నది.

ఈ నేపథ్యంలో వారిద్దరూ త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటివరకు ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చేసిన వీరు త్వరలోనే హాఫ్ స్క్రీన్ పై రొమాన్స్ చేయటానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అంజలి తెలుగులో ఒక సినిమా, తమిళం లో రెండు సినిమాలు తీస్తున్నది. అయితే ఇది ఎంతవరకు నిజమో మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

హరీష్ శంకర్ దర్శకత్వం లో బన్నీ

25-06-2016

అల్లు అర్జున్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఓ సినిమాని నిర్మించడానికి సన్నద్ధమవుతున్నారు. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందివ్వనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని దిల్ రాజ్ తెలియజేస్తూ ఇంతకు ముందు 'ఆర్య', 'పరుగు' సినిమాలను చేయగా అవి ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత మా బ్యానర్ లో 'ఎవడు' సినిమాలో బన్నీ ఒక ప్రత్యేక పాత్ర చేశారు.

అతని బాడీ లాంగ్వేజ్ కి మరియు భాషకు సరిపోయే కథను హరీష్ శంకర్ సిద్ధం చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వం లో సినిమా తీస్తునందుకు చాలా ఆనందంగా ఉందని దిల్ రాజ్ తెలిపాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలిసింది. దీనిని 2017 లో వేసవిసెలవుల సందర్బంగా విడుదల చేస్తామని చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

చిరంజీవి సునీల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు

25-06-2016

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా 'కత్తిలాంటోడు' సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ ఆ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి సునీల్ 'జక్కన్న' మూవీ ఆడియో లాంచ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చి సునీల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ యంగ్ హీరోలలో టాప్ డ్యాన్సర్ ఎవరు అంటే ముందు వరుసలో నిలిచే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ లతో సమానంగా సునీల్ ను పోలుస్తూ చిరంజీవి ఆసక్తికరవిషయాలు చేశాడు. సునీల్ తన స్వయం శక్తితో కమీడియన్ స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. అంతేకాకుండా అతను డ్యాన్స్ పై చూపే ఆసక్తి తనకు బాగా నచ్చిందని తెలిపాడు.

చిరంజీవి కురిపించిన ప్రశంసలకి సునీల్ ఆనడం హద్దులు దాటిపోయింది. కానీ కొందరు విమర్శకులు చిరు తన 150 వ సినిమాలో ఛాన్స్ ఇవ్వకుండా షాకిచ్చిన ఈ ప్రశంసలతో కప్పిపుచ్చాడని ఆ ఫంక్షన్ కు వచ్చిన కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే నిన్న విడుదలైన లేటెస్ట్ టీజర్ ను చూసిన ప్రతి ఒక్కరు 'జక్కన్న' లో ఫైట్స్, రొమాన్స్, కామెడీ గ్లామర్ అన్ని ఈ సినిమాలో చూపెట్టి ఎలాగైనా హిట్ కొట్టాలనే గట్టి ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది.

'ఉడ్తా పంజాబ్' పాకిస్థాన్ లో లేనట్లే

25-06-2016

'ఉడ్తా పంజాబ్' మూవీ ని పాకిస్థాన్ లో ప్రదర్శించేది లేదని ఆ సినిమా దర్శక నిర్మాతలు తెలిపారు. కనీసం 100 కట్ లు లేనిదే అక్కడ ఆ సినిమాని ప్రదర్శించకూడదనే పాక్ సెన్సార్ బోర్డు చెప్పడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాని పాకిస్థాన్ లో విడుదలచేయకపోవడం వల్ల చాలా లాస్ అయ్యామని కానీ 100 కట్ లు చేసి విడుదల చేయడం వ్యర్థమని వాళ్ళు తెలిపారు. భారతదేశం లో 89 కట్ లు చేయాలని సూచించిన కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నామని అక్కడ అలాంటి అవకాశం కూడా లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సినిమా కలెక్షన్ లు ప్రస్తుతం బాగానే ఉన్నాయని ఇంటర్నెట్ లో లీక్ అవకుండా ఉంటే ఇంకా బాగుండేదని దర్శకుడు చౌబే చెప్పారు. సినిమాలో కొన్ని పదాల వాడకం వల్ల విమర్శలు వస్తున్నాయని కానీ వాళ్ళు నిజజీవితంలో అలాగే మాట్లాడేవారని అన్నాడు. డ్రగ్ పెడలింగ్, డ్రగ్స్ వాడకం గురించి తాము సందేశం ఇవ్వాలనుకున్నామని అందుకే నిజ జీవితాలను ప్రతిబింబించక తప్పలేదని దర్శకుడు తెలిపాడు.

అంధుడి గా రామ్

25-06-2016

'నేను శైలజ' మూవీ తో సూపర్ హిట్ కొట్టిన రామ్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం 'ఉయ్యాల జంపాల' దర్శకుడు విరించి వర్మ దర్శకత్వం లో సినిమా తీస్తున్న రామ్ తర్వాత సినిమాను కూడా లైన్లో పెట్టాడు. 'నేను శైలజ' తర్వాత కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్న రామ్ ఇప్పుడు రెండు సినిమాలకు రెడీ అయిపోయాడు. అంతే కాకుండా ఆ తర్వాత మూవీ లో ఓ రిస్క్ చేయడానికి తయారయ్యాడు. మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రామ్, మాస్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

కామెడీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తెరకెక్కించే రావిపూడి రామ్ కోసం ఎనర్జిటిక్ స్టోరీ ని రెడీ చేశాడట. అయితే ఈ సినిమాలో రామ్ అంధుడి పాత్రలో నటించనున్నాడని ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా ప్రకటించాడు. అనిల్ దర్శకత్వం లో సుప్రీం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా తన తదుపరి సినిమాను ప్రకటించాడు. ఇంతవరకు ప్రయోగాలకు ఇష్టపడని రామ్ తొలిసారిగా ప్రయోగానికి సిద్ధపడ్డాడు. ఇది ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.





Facebook | Twitter | Google+