You may missed !

When A Taiwan girl met Bahubali! Bahubali entering Taiwan soon!

As it's getting bore for everyone to introduce about Bahubali each time- hope better to jump directly to matter- Rajamouli and team now busy in constr Full Story Here


Vishal Father makes Debut role in Nivin Pauly movie!!!

Malayalam actor Nivin Pauly is now making a comeback into Tamil cinema with a new film, with director Gautam Ramachandran. Natty aka Natraj - the popu Full Story Here


Cuty baby Selfie with Ali...

Vidya Ramana is an Innocent and Comedy actress in Tollywood and Kollywood industry and in “Mapla Singam” her performance is away from scene and so Full Story Here


'Policesodu' press meet held today in Hyderabad

Vijay is a famous and most popular actor in Kollywood and done so many films and got craze with his acting and coming to filming recently completed Full Story Here


Resugurram Completed 2 Years!

“Rusugurram” who is our’s Mr. Perfect Allu Arjun is most popular with Gangothri directed by K. Ragavendra Rao which is his debut film in Telugu, Full Story Here


మరదలి దర్శకత్వం లో భావ?

21-06-2016

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య మళ్లీ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతోంది. తండ్రి రజినీకాంత్ తో 'కొచ్చాడయాన్' తీసి చేతులు కాల్చుకున్న సౌందర్య... తాజాగా రెండో సినిమాకి సిద్దం అవుతోంది. 'కొచ్చాడయాన్' ఫ్లాప్ తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చి మూడు సంవత్సరములు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మరోసారి మెగా ఫోన్ పట్టనుంది.

ఇప్పుడు బావ ధనుష్ తో ఓ రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథ చర్చల్లో బావ, మరదళ్ళు బిజీగా ఉన్నారని సినీ వర్గాల ద్వారా సమాచారం. సౌందర్య తండ్రి సినిమా మాదిరిగా కాకుండా బావ అయిన ఆమెకు హిట్ ను అందించి పెడతాడేమో చూడాలి.

మలేసియా లో నేతాజీ కాంస్య విగ్రహం

20-06-2016

స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన నేతాజీ సుభాస్ చంద్రబోష్ కు మలేసియా లో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ కల్చరల్ సెంటర్ లో నేతాజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ఏ లోని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ నుంచి ముగ్గురు మహిళలతో పాటు, మరో ఇద్దరు వీడియో ద్వారా పాల్గొన్నారు. కాగా ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ అనే శిల్పకారుడు తయారుచేశాడు.

అతను మన దేశానికి చేసిన సేవలు మరువరానివి. మన దేశానికి స్వాతంత్యం సంపాదించిపెట్టటం కోసం తన ప్రాణాలనే పనగా పెట్టిన మహనీయునికి దన్యవాదములు తెలియజేయాలి. మనం ఇప్పుడు ఇంత స్వేఛ్చ గా బ్రతుకుతున్నామంటే దానికి అ మహనీయులే కారణం.

రాజమౌళి బాలయ్య, మహేష్ కాంబినేసన్ లో సినిమా తీస్తున్నాడా?

20-06-2016

నందమూరి బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు ఇద్దరు స్క్రీన్ పంచుకుంటారని ఫిల్మ్ నగర్ లో టాక్. దీనికి క్రియేటివ్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తీస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వాళ్ళు ఇద్దరు ఎవరికీ వారే సాటి కాబట్టి వాళ్ళు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయగలరని రాజమౌళి బావిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు మురగన్ దాస్ దర్శకత్వం లో వస్తున్న మూవీ సెట్స్ పైకి వస్తున్నది.

ఇక బాలయ్య విషయానికి వస్తే 'గౌథమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వీళ్ల సినిమాలు పూర్తి కాగానే ఈ మూవీ కి సంబంధించిన పనులు జరుగుతాయి. అయితే వీళ్ళ కాంబినేసన్ మూవీ వస్తే ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి.

సాయి ధర్మ తేజ్ తిక్క రెడీ

20-06-2016

రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ మూవీ లతో హ్యాట్రిక్ సాధించి మంచి ఊపుమీదున్న సాయి ధర్మ తేజ్ 'తిక్క' మూవీ కి రెడీ అవుతున్నాడు. లరస్సా బోన్సి, మన్నార్ చోప్రాలు హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ సినిమా మోసన్ పోస్టర్ ఈ నెల 25 న విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా రెండు పాటలు మినహా టాకీ పూర్తి చేసుకుంది.
br/> పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఆడియో ను జూలై మొదటివారం లో గ్రాండ్ గా విడుదలచేయడానికి సిద్దం అయ్యారు. అతి త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి ఈ సినిమాని జూలై 3 వ వారం లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపారు.

'షో టైం' ఫస్ట్ లుక్ రిలీజ్

20-06-2016

మర్యాద రామన్న, ఈగ, సన్ ఆఫ్ సర్దార్ సినిమాలకు రైటర్ గా పనిచేసిన ఎస్.ఎస్. కాంచి ఇప్పుడు 'షో టైం' మూవీ తో డైరెక్టర్ గా ఆరంగేట్రం చేశాడు. ఎస్.ఎస్. కాంచి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టిజెర్ ను డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేశారు. టిజెర్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉందని దర్శక ధీరుడు అన్నాడు. 'షో టైం' మంచి విజయం సాధించాలని కాంచికి మంచి పేరు తీసుకరావాలని రాజమౌళి ఆకాంక్షించారు. రానదీర్, రుక్సార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.


ఏపీ లో కొత్త ఉద్యమ సంస్థ

20-06-2016

నవ్యాంద్ర రాజధాని అమరావతి లో కొత్త ఉద్యమ సంస్థ 'మన రాజ్యం' ఏర్పాటైంది. దీనిని లోక్ సత్తా మాజీ నేతలు ఐ. రామమూర్తి, కఠారి శ్రీనివాస రావు, వర్మ ప్రాదినిత్యం వహిస్తున్నారు. గుంటూరు లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ తోలి సదస్సు వినుకొండలో జరిగింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడటానికే ఈ సంస్థను స్థాపించినట్లుగా, అందరి భాగస్వామ్యంతో కులరహిత సమాజానికి ఉద్యమిస్తామని అద్యక్షుడు రామమూర్తి తెలిపాడు.

ఈ రోజుల్లో కూడా చాలా మారుమూల ప్రాంతాలలో ఈ కుల వ్యవస్థ ఉంది. ఇప్పటికి కూడా అంటరాని వారని కొందరిని ఊరిబయట ఉంచడం జరుగుతోంది. ఇలాంటి అరాచకాలను అరికట్టడానికే ఈ సంస్థను నెలకొల్పినట్లు తెలిపారు.

దయ్యంగా కనిపించనున్న రెజీన

20-06-2016

సెల్వ రాఘవన్ దర్శకత్వం లో గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న సినిమాలో రెజీన దయ్యంగా నటిస్తోందట. ఎన్నో రోజుల నుంచి హిట్ లు లేక వేసి వేజారిన సెల్వ రాఘవన్ కు ఈ మూవీ అయిన హిట్ సాధించిపెడుతుందో లేదో చూడాలి. దెయ్యం పాత్ర కోసం ఇప్పటికే ఆమె లుక్ టెస్ట్ చేశారట.

త్వరలోనే రెజీన పార్ట్ కు సంబంధించిన షూటింగ్ మొదలవుతుందట. డైరెక్టర్ గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్. జె. సూర్య, నందిత ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్స్ తో మంచి ఫేమ్ అయిన రెజీన ఇప్పుడు ఆమెకు ఆఫర్స్ తక్కువగా రావటం తో ఈ పాత్రకు ఓకే చెప్పినట్లు సమాచారం.

ఈ రోజు చాల పెద్దదట

20-06-2016

ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుండడం ప్రతి రోజు చూస్తూనే ఉన్నాము కదా! ఈ రోజుకు కూడా ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. ఏడాదిలో ఈ రోజు అతి పెద్దరోజట. సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘవృత్తాకార క్రమంలో 1- 1.30 గంటల ఎక్కువ సమయం భూమిపై కాంతి పడుతుండట.కొన్ని చోట్ల ఇది ఏకంగా 20 గంటల పాటు ఉంటుందట, అంతేకాకుండా ఈరోజు 'స్ట్రాబెర్రీ మూన్' ఒక ప్రత్యేకత. అతి పెద్ద రోజున స్ట్రాబెర్రీ మూన్ రావడం 70 ఏళ్ళ తర్వాత రావటం ఇదేతొలిసారి.స్ట్రాబెర్రీలు పండే సీజన్ కు ముందుగా వచ్చే పున్నమి స్ట్రాబెర్రీ మూన్. ఇలాంటి అద్బుతాలు ఎన్నో సంవత్సరాలకు ఒక సారిమాత్రమే వస్తాయి.

'బాబు బంగారం' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

20-06-2016

మారుతి దర్శకత్వం లో సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న 'బాబు బంగారం' ఆడియో విడుదల డేట్ ఖరారు అయినది. విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆడియో ను జూలై 9 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఇందులో విక్టరీ వెంకటేష్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'గోపాల గోపాల' మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నటిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈయన మరి రెండు సినిమాలు తీయడానికి రెడీ గా ఉన్నాడు. 'బాబు బంగారం' నందు ఇతను కామెడి పోలీస్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ ప్రేక్షకులందరికీ నచ్చేవిదంగా ఉంటుందని చిత్ర యూనిట్ బృందం తెలిపింది.

నేరేడు పండుతో ఆరోగ్యం

20-06-2016

ఈ సీజన్లో విరివిగా లభించే నేరేడుపండు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలిపారు. దేనివల్ల మనకు కలిగే లాభాలను కింద వివరించడం జరిగింది. కడుపులో నులిపురుగులను చంపడంతో పాటు నోటి క్యాన్సర్ కి ఔషదంగా పనిచేస్తుంది. నోటిపూత, చిగుళ్ళ వ్యాదులు, దంతక్షయం నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ సమస్యలు, దయోరియాను నివారిస్తుంది. దీని గింజలను కాల్చి పొడిచేసి నీటిలో కలిపి తాగితే షుగర్ అదుపులో ఉంటుంది. గాయమైన చోట దీని ఆకును ఉంచి కట్టుకడితే త్వరగా నయమవుతుంది.





Facebook | Twitter | Google+