You may missed !

Happy Birthday To Nani : How Nani Became 'Natural Star' ?

Today Nani’s birthday, got big hit with KrishnaGaadiVeeraPremaGadha film, impressed with his natural performance- also called as ‘Natural Star’. Full Story Here


Director Ram opens about Taramani!!!

Taramani is an out and out Love story which says the different dimension of male and female relationship. Taramani is a long term pending love story o Full Story Here


After Watching Vedalam

"Truly satisfied and thrilled after watching vedhalam! #thalapolavaruma", this is the feeling of Anchor Nakshatra after watching Vedalam. She said tha Full Story Here


Neha ready to have break fast!

Neha Dupiya, who is not appearing from Two years on screen and became passive after “Ungalli” and appears so tall and beautiful and also won Femin Full Story Here


Maalai Nerathu Mayakkam Finally Releasing

Maalai Nerathu Mayakkam, after many ups and downs- the movie is going to release on January 1st 2016. The poster released today looking something diff Full Story Here


ల్యాప్ ట్యాప్ వేడికి రాగి బిల్లలతో చెక్

11-06-2016

ల్యాప్ ట్యాప్ వేడెక్కినా వాడితే పాడైపోయే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా జపనీయులు వినూత్న పద్దతిలో ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. కొన్ని రాగి నాణేలను కీ బోర్డు పై ఉంచితే ఆ రాగి నాణేలు మంచి ఉష్ణ వాహకంగా పనిచేసి రాగి వేడిని గ్రహించి ల్యాప్ ట్యాప్ ను చల్లగా ఉంచుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. దీనితో ఎలాంటి భయం లేకుండా ల్యాప్ ట్యాప్ తో ఎంతసేపయిన పనిచేసుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు.

3.26 కేజీ ల బంగారం పట్టుబడ్డది

11-06-2016

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 3.26 కేజీ ల బంగారాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని దుబాయ్ నుంచి వస్తున్న ఒక ప్రయాణికుడి నుండి ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు 28 బంగారుకడ్దీలను స్వాదీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు 93 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రయానికుని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.

స్కూల్ టీచర్స్ జీన్స్ వద్దు

11-06-2016

హర్యానా ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. స్కూల్ టీచర్స్ జీన్స్ ఫ్యాంట్ వేసుకోవడంపై నిషేధం విధించింది. రేపటి భావిభారత పౌరులను తయారుచేసే సమాజానికి ఆదర్శంగా ఉండాలనే కారణంతోనే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు జీన్స్ వస్త్రాలు ధరించిన వారిపై మంచి అభిప్రాయం కల్గడంలేదని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది ఉపాద్యాయులు మండిపడుతున్నారు.

భవనం కూలి ఇద్దరు మృతి

11-06-2016

హైదరాబాద్ లోని పురానా పూల్ లో అర్దరాత్రి దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వాళ్ళంతా ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ భవనం మహేశ్వరీ ట్రస్ట్ కు చెందినదిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కూలీలంతా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన వారుగా గుర్తించారు.

పవన్ ను దాటేసినా నితిన్

11-06-2016

నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నా ముందంజలో ఉన్నాడు.అతని 'అ ... ఆ' మూవీ పవన్ అత్తారింటికి దారేది మూవీ కలెక్షన్లను దాటిపోయింది. కేవలం 8 రోజుల్లోనే నితిన్ ఈ రికార్డు ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ మూవీ నాల్గవ స్థానంలో ఉండగా దీనికంటే ముందు భాహుబలి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో మూవీ లు ఉన్నాయి. మూవీ వసూళ్ళలో 'అత్తారింటికి దారేది' మూవీ ఐదో స్థానంలో ఉంది.


ఉడ్తా పంజాబ్ కు ఒకే ఒక కట్ : హైకోర్ట్

10-06-2016

బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్న 'ఉడ్తా పంజాబ్' చిత్ర సెన్సార్ పై బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. సెన్సార్ 89 కత్తిరింపులు చేయగా కోర్ట్ ఒక కత్తిరింపు మాత్రమే చేయాలని సెన్సార్ బోర్డు కు తెలిపింది. సినిమా తీయటం వెనుక ఉన్న తన తపన, కష్టాన్ని వివరించిన కశ్యప్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం సోమవారం న తీర్పు ఇవ్వనుంది.

విదేశీ పర్యటనకు చంద్రబాబు

10-06-2016

ఏపీ సిఎం చంద్రబాబు విదేశీ పర్యటనకి వెళ్లనున్నారు. ఈ నెల 26 - 29 వరకు చైనా లో పర్యటిస్తాడనిసమాచారం. చైనా లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశం లో ఆయన పాల్గొంటారు. అయితే నూతన రాష్ట్రం లో చైనా పెట్టుబడులను ఆహ్వానించేందుకు పలు సంస్థల ప్రతినిదులతో పత్యేకంగా భేటీ కానున్నారు.

నాని జెంటల్మన్ సెన్సార్ పూర్తి

10-06-2016

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో నాని, సురభి జంటగా నటిస్తున్న జెంటల్మన్ మూవీ సెన్సార్ బోర్డు 'యు' సర్టిఫికేట్ మంజూరుచేసింది. ఈ మూవీ ని జూన్ 17 వ తేది రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ సినిమాలో నాని ప్లే చేస్తున్నది హీరో న లేదా విలన్ న లేక రెండూ న అనేది ప్రేక్షకులకు అంతుపట్టని ప్రశ్నగా మారింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రోడ్యుసన్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. అంతేకాకుడా ఈ మూవీ కి మణి శర్మ మ్యూజిక్ కంపోస్ చేస్తున్నాడు.

ఆ నెంబర్ పాస్ వర్డ్ వర్డ్ గా వద్దండి

10-06-2016

సిటిజన్ల వ్యక్తిగత వివరాల గోప్యతకోసం 12345 అనే నెంబర్ ను పాస్ వర్డ్ గా వాడుతున్నారని తెలిసింది. దీనితో సైబర్ నేరగాళ్ళు సులువుగా హ్యాకింగ్ చేస్తున్నారని లీక్ద్ సోర్స్ సంస్థ తెలిపింది. తాజాగా భారీగా ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ కు గురికాగా ఈ అకౌంట్లలో ఎక్కువ మంది 12345, qwerty , పాస్వర్డ్ వంటి పదాలను పాస్వర్డ్ గా పెట్టుకున్నారని పేర్కొంది. దీనితో హ్యాకర్లు ఈజీ గా దాడి చేయగలిగారని నిపుణులు తెలిపారు.

ఎఫ్ బి లో 360 డిగ్రీ ఫోటో లు

10-06-2016

సోషల్ మీడియా సైట్ పేస్ బుక్ లో 360 డిగ్రీ ఫోటోలను అప్లోడ్ చేసుకోవచ్చు. 360 డిగ్రీల కెమరాతో తీసిన ఫోటోలతో పాటు, మొబైల్ ఫోన్ తో తీసిన పనోరమక్ ఫోటోలను 360 డిగ్రీ వ్యూ లో మార్చుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ఫోటోలను వర్చువల్ రియాలిటీ కంపాటబుల్ డివైజెస్ లో కూడా చూడవచ్చని తెలిపింది. ఎఫ్ బి అప్ డేట్ వర్సన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.





Facebook | Twitter | Google+